Header Banner

తెనాలి - రేపల్లె రూట్ లో రైళ్ల షెడ్యూల్ మార్పులు.. కొన్ని రైళ్లు రద్దు! ప్రయాణికులకు రైల్వే సూచనలు!

  Wed Feb 12, 2025 12:19        Travel

తెనాలి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ అలర్ట్ జారీ చేసింది. తెనాలి జంక్షన్ లోని యార్డ్ లో ఆధునీకీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అటువైపు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు సమయాల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. తెనాలివైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాలని అధికారులు కోరారు. తెనాలి జంక్షన్ మీదుగా వెళ్లే గూడూరు-కృష్ణా కెనాల్ జంక్షన్ మూడో లైన్ నిర్మాణం కారణంగా తెనాలి రోడ్ నంబర్ 2ను ఇవాళ్టి నుచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీని వల్ల మూడు రైళ్లను ఇవాళ, రేపు రద్దు చేశారు. వీటిలో విజయవాడ-తెనాలి( 67221), తెనాలి-రేపల్లె(67231), రేపల్లె-తెనాలి (67332)రైళ్లు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 


అలాగే తెనాలి-రేపల్లె మధ్య నడిచే మరో రైలు (67224)ను ఇవాళ, రేపు గంట ఆలస్యంగా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్త రైల్వే ట్రాక్ ల నిర్మాణంతో పాటు యార్డ్ ల ఆధునీకరణ, స్టేషన్ల సుందరీకరణ వంటి పలు పనులు చేపడుతున్నారు. వీటి కారణంగా అధికారులు ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. వీటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు దీన్ని తెలుసుకుని రాకపోకలు సాగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ, రేపు తెనాలి జంక్షన్ మీదుగా రేపల్లె, విజయవాడ, చెన్నై వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాలని కోరారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tenali #railway #junction #traincancelled #trackrepair #todaynews #flashnews #latestupdate